Education21st May 03:44 PMSunil Byrisetty1 min read
మదర్సాల్లో 'ఆపరేషన్ సిందూర్'
పాకిస్తాన్ ఉగ్ర క్యాంపులపై ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ విజయాన్ని విద్యార్థులకు కూడా తెలియాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించ
పాకిస్తాన్ ఉగ్ర క్యాంపులపై ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సూపర్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆ విజయాన్ని విద్యార్థులకు కూడా తెలియాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తరాఖండ్ మదర్సాల సిలబస్లో 'ఆపరేషన్ సిందూర్' ఉంటుందని ఆ రాష్ట్ర మదర్సా విద్యా బోర్డు ఛైర్మన్ ముఫీ షామున్ ఖాస్మి ప్రకటించారు.
OP సిందూర్ ఆవశ్యకత, సైనిక విజయాలు, దేశ భద్రత గురించి విద్యార్థులు తెలుసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అమాయకుల ప్రాణాలు తీసినందుకు ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలన్నారు.
పహల్గామ్ ఉగ్రవాదులు దాడికి ఒడిగట్టడం ఖురాన్ను తక్కువ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు