Politics11th Mar 01:23 PMSunil Byrisetty1 min read
సాయమంటూ ట్వీట్ చేస్తే లక్షన్నర ఇచ్చిన లోకేష్
అభం శుభం తెలియని చిన్నారి అనుకోకుండా ప్రమాదానికి గురవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. వైద్య సాయం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కోరడంతో సత్వరమే స్పందించిన మంత్రి
అభం శుభం తెలియని చిన్నారి అనుకోకుండా ప్రమాదానికి గురవడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.
వైద్య సాయం అందించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కోరడంతో సత్వరమే స్పందించిన మంత్రి..
సదరు కుటుంబానికి అండగా నిలిచారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం డిప్పకాయలపాడుకు చెందిన కైకవరపు వెంకట్రావు కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అతడి ఏడాదిన్నర వయసున్న కుమారుడు ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడిపోవడంతో చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో బాలుడికి మెరుగైన వైద్యానికి సాయం అందించాలని ఎక్స్ ద్వారా మంత్రి నారా లోకేష్ ను విజ్ఞప్తి చేశారు.
వెంటనే స్పందించిన మంత్రి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
దీంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1.52 లక్షల చెక్కు అందజేశారు.
మంత్రి లోకేష్ సాయం పట్ల బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.