Farmers13th Jul 12:00 PMSunil Byrisetty1 min read

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కేసరపల్లిలో సుపరిపా

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కేసరపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఏడాదికాలంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. స్థానికుల అర్జీలు స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయిలను తాము అధికారం చేపట్టిన వెంటనే చెల్లించినట్లు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా రైతుల వద్ద నుండి 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, ధాన్యం సొమ్మును నెలలోపు రైతుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు. కృష్ణా డెల్టాకు సకాలంలో సాగునీటిని విడుదల చేశామన్నారు. గ్రామీణ నీటిపారుదల శాఖ ద్వారా ఆధునీకరణ అభివృద్ధి పనులకు ఈ ఏడాది కాలంలో రూ.85 లక్షల ఖర్చు చేసినట్లు వివరించారు. పాడి రైతులకు సహాయం చేయూత నిచ్చేందుకు రూ. 3.26కోట్ల ఖర్చుతో 186 మినీ గోకులం షెడ్లు నిర్మించినట్లు యార్లగడ్డ వివరించారు.
Andhra Pradesh news
ap government
Tdp
Farmers
Welfare
chandra babu
MLA Yarlagadda Venkat Rao
good governance program
రైతులకు చేయూత 3.26కోట్ల ఖర్చుతో 186 మినీ గోకులం షెడ్లు
రైతుల నుండి 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం
Scroll for the next article