Health1st Mar 06:57 PMSunil Byrisetty1 min read
సమ్మర్ అంటే పుచ్చకాయ.. నీరే కాదు..పోషకాల గని!
శరీరానికి కావలసినన్ని విటమిన్లు అందించడంతో పాటు పుచ్చకాయ అత్యంత సులువుగా జీర్ణమవుతుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా పుచ్చకాయలను అందరూ ఇష్టంగా తింటారు. దీనిలో మూడింట ఒక వంతు క్యాలర
శరీరానికి కావలసినన్ని విటమిన్లు అందించడంతో పాటు పుచ్చకాయ అత్యంత సులువుగా జీర్ణమవుతుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా పుచ్చకాయలను అందరూ ఇష్టంగా తింటారు. దీనిలో మూడింట ఒక వంతు క్యాలరీలు మాత్రమే ఉండడం వల్ల శరీరం బరువు పెరిగే అవకాశం లేదు. ఒకవిధంగా పోషకాల గని ఇది. పుచ్చకాయలో 92 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో ఇది శరీరానికి కావాల్సిన చల్లదనాన్ని ఇస్తుంది. దాహార్తి నుంచి రక్షిస్తుంది. 21 శాతం సి- విటమిన్, 18 శాతం ఏ-విటమిన్, 5 శాతం పొటాషియంతో పాటు బి- 1, బి-5, బి-6 విటమిన్లు 3 శాతం దాకా ఉంటాయి. దీనిలో క్యాల్షియం నిల్వలు కూడా ఎక్కువే.