News31st Jul 10:40 AMSunil Byrisetty1 min read
యువనేత సింగపూర్ టూర్ సక్సెస్
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. నాలుగురోజుల పర్
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. నాలుగురోజుల పర్యటన ముగించుకొని గురువారం ఉదయం స్వరాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్ కు అక్కడి తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కనీవినీ ఎరుగనిరీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఎపి బ్రాండ్ ఇమేజ్ ను ఇనుమడింపజేసింది. నాలుగురోజుల పర్యటనలో సిఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో వన్ టు వన్ చర్చలు 19, జి టు జి (గవర్నమెంటు టు గవర్నమెంట్) సమావేశాలు 6, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4సైట్ విజిట్లు, రోడ్ షో/డయాస్పోరా ఈవెంట్స్ 2 కలిపి మొత్తం 35 కార్యక్రమాలకు లోకేష్ హాజరయ్యారు.