Entertainment19th May 01:41 PMSunil Byrisetty1 min read
జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..!
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు
తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.
జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించారు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు పలు అంశాలపై చర్చించారు.
సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు.
అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్లు తేల్చిచెప్పారు.
పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్లు తీర్మానం చేశారు.
ఈ నేపథ్యంలో జూన్ 1లోపు సానుకూల నిర్ణయం రాకపోతే థియేటర్లు బంద్ కానున్నాయి.