News30th May 01:18 PMSunil Byrisetty1 min read

క‌ళాత్మ‌క సౌంద‌ర్యం.. యోగానందం

క‌ళాకారులు సాంస్కృతిక వాస్తు శిల్పులు.. క‌ళాకారుల‌కు స‌మాజంలో మార్పు తెచ్చే శ‌క్తి ఉంద‌ని, వారి క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు స‌మాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేయిస్తాయ‌ని, సంపూర్ణ ఆరోగ్య

క‌ళాత్మ‌క సౌంద‌ర్యం.. యోగానందం
క‌ళాకారులు సాంస్కృతిక వాస్తు శిల్పులు.. క‌ళాకారుల‌కు స‌మాజంలో మార్పు తెచ్చే శ‌క్తి ఉంద‌ని, వారి క‌ళా ప్ర‌ద‌ర్శ‌న‌లు స‌మాజాన్ని మెరుగైన మార్గంలో అడుగులు వేయిస్తాయ‌ని, సంపూర్ణ ఆరోగ్యానికి సోపాన‌మైన యోగాను ప్ర‌తిఒక్కరికీ చేరువ‌చేసేందుకు క‌ళాకారులు కృషిచేయాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఆయుష్‌శాఖ‌, ఎన్‌టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో నిర్వ‌హించిన ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పాల్గొని నాట్యాచార్యులు, క‌ళాకారులతో క‌లిసి యోగాసనాలు అభ్య‌సించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ యోగాంధ్ర మాసోత్స‌వాల్లో భాగంగా స‌మాజంలోని ప్ర‌తివ‌ర్గానికి యోగాను చేరువ‌చేయాల‌నే ఉద్దేశంతో థీమ్ యోగా నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. ఇందులో భాగంగా క‌ళాకారుల‌తో నిర్వ‌హించిన యోగా అభ్య‌స‌న కార్యక్ర‌మం విజ‌య‌వంత‌మైంద‌ని తెలిపారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం జూన్ 21 నాటికి స‌ర్వ రోగ నివారిణి అయిన యోగాను రాష్ట్రంలో క‌నీసం రెండు కోట్ల మందికి జిల్లాలో దాదాపు 10 ల‌క్ష‌ల మందికి చేరువ‌చేసేందుకు కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.
Andhra Pradesh news
Vijayawada Municipal Corporation
theme yogandhra
Collector Dr. G. Lakshmisha
Artists
ఆయుష్ శాఖ
యోగానందం
కళాత్మక సౌందర్యం
Scroll for the next article