News25th Sep 05:49 PMSunil Byrisetty1 min read
వైసీపీ హయాంలో శాంతిభద్రతలు లేవు
రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనసభలో మాట్లాడిన ఆమె, వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు లేనని, మద్యం ధరల భయంతో యువత
రాష్ట్రంలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శాసనసభలో మాట్లాడిన ఆమె, వైసీపీ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతలు లేనని, మద్యం ధరల భయంతో యువత గంజాయి వైపు మొగ్గుచూపిన దుస్థితిని గుర్తుచేశారు. అప్పట్లో స్కూల్ పిల్లలకే గంజాయి పంపిణీ చేసే దుస్థితి ఉండేదని, సీఎం చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది అని అన్నారు. గంజాయి మాఫియాను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఈగల్’ విభాగం ద్వారా 40 వేలకు పైగా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో వచ్చిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో నేరాలు 60 శాతం మేరకు తగ్గాయని మంత్రి తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా 'శక్తి' మొబైల్ యాప్‌ను తీసుకువచ్చామని చెప్పారు. అలాగే న్యాయవ్యవస్థను పటిష్ఠం చేయడం వల్ల కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయి అని వివరించారు.