Politics26th Oct 02:04 PMSunil Byrisetty1 min read
ఏకగ్రీవాలు కావు.. కూటమి పార్టీల బలాత్కారాలు
స్థానిక సంస్థల్లో జరుగుతున్నవి ఏకగ్రీవాలు కావని, అధికార మదంతో కూటమి పార్టీలు చేసిన బలాత్కారాలని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఇవి ప్రజా ఆమోదం కాదు.. కూటమి పార్టీల అరాచకాన
స్థానిక సంస్థల్లో జరుగుతున్నవి ఏకగ్రీవాలు కావని, అధికార మదంతో కూటమి పార్టీలు చేసిన బలాత్కారాలని APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఇవి ప్రజా ఆమోదం కాదు.. కూటమి పార్టీల అరాచకానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కూటమి కమిషన్ గా మార్చి, నడిరోడ్డుపై రాజ్యాంగాన్ని ఖూనీ చేసి, పోలీసు వ్యవస్థను బానిసగా చేసి, కళ్ళముందే పత్రాలు చించి, ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తూ, రక్తపాతంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన ఘనత కూటమి పార్టీలదంటూ తీవ్ర విమర్శలు చేశారు. 16 మున్సిపాలిటీలు, 639 వార్డులు, 4 ZPTC లు , 32 ఎంపీటీసీల స్థానాల్లో జరిగినవి ఏకగ్రీవాలు కాదని, కూటమి పార్టీల భయోత్పాతానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆనాడు YCP చేసిందని నేడు మీరు చేస్తారా ? వాళ్ళు గడ్డి తిన్నారని , మీరు అదే తింటారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, బలవంతపు ఏకగ్రీవాల మీద చర్యలు తీసుకోవాలని అన్నారు.