Business Type12th Mar 12:38 PMSunil Byrisetty1 min read

రూ. లక్షకే మూడు స్కూటర్లు

ఈవీ స్కూటర్ కొనాలనుకునే వాళ్లకు మ్యాక్(MAC) మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ వెహికల్ చూసినా రూ. లక్షపైనే పెట్టాల్సి వస్తోంది. కానీ మ్యాక్ మోటార్స్ రూ. లక్షకే

రూ. లక్షకే మూడు స్కూటర్లు
ఈవీ స్కూటర్ కొనాలనుకునే వాళ్లకు మ్యాక్(MAC) మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ వెహికల్ చూసినా రూ. లక్షపైనే పెట్టాల్సి వస్తోంది. కానీ మ్యాక్ మోటార్స్ రూ. లక్షకే 3 ఈవీ స్కూటర్లను అందించే బడా ఆఫర్ తీసుకొచ్చింది. విడిగా ఒక వాహనం కానాలనుకున్నా రూ. 37 వేలకు కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. మార్కెట్లో విపరీతమైన రెస్పాన్స్ రావడంతో ఉత్పత్తిని భారీగా పెంచారు. ఇంత తక్కువ ధరకే వాహనం ఇస్తున్నప్పటికీ నాణ్యతలో ఎలాంటి రాజీ లేదని చెబుతున్నారు. హైదరాబాద్‌కు సమీపంలోని చర్లపల్లిలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ పెట్టి, ఆన్ లైన్ ద్వారానూ విక్రయిస్తున్నారు. అయితే తక్కువ ధరకు వాహనం ఇవ్వడానికి కారణం కొన్ని స్పెసిఫికేషన్లు మాత్రమే ఇస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే స్పీడ్ రేంజ్ కూడా 50-60 కిలోమీటర్లు ఉంటుందని చెబుతున్నారు. చర్లపల్లిలో ఇస్తున్న ధరకే డీలర్ల వద్దా అదే ధరను కొనుగోలుదారుడికి అందిస్తున్నామని నిర్వాహకులు వివరిస్తున్నారు. స్పేర్ పార్ట్స్, టెక్నికల్ సపోర్ట్ విషయంలో మ్యాక్ మోటార్స్ వినియోగదారుడికి అత్యుత్తమ సేవలు అందిస్తోంది.
Mac Scooters
Hyderabad
మ్యాక్ మోటార్స్
Scroll for the next article