Mobiles24th May 04:19 PMSunil Byrisetty2 min read
ఫొటోగ్రఫీ కోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్లు
ఫొటోలు తీయడానికి ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది. కానీ ఆ ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీ, స్పష్టతతో రావాలంటే మంచి కెమెరా ఫీచర్లున్న ఫోన్ అవసరం. అలాంటి ఫీచర్లతో 4క
ఫొటోలు తీయడానికి ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది.
కానీ ఆ ఫొటోలు, వీడియోలు మంచి క్వాలిటీ, స్పష్టతతో రావాలంటే మంచి కెమెరా ఫీచర్లున్న ఫోన్ అవసరం.
అలాంటి ఫీచర్లతో 4కే రికార్డింగ్ తో వివిధ ప్రముఖ కంపెనీల ఫోన్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రూ.15 వేల కంటే తక్కువ ధరలో లభించే ఫోన్ల వివరాలు తెలుసుకుందాం.
ఆధునిక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు కలిగిన సీఎంఎఫ్ ఫోన్ 1 తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది.
సూపర్ అమోలెడ్ ఎల్టీపీఎస్ ప్యానెల్ కలిగిన 6.67 అంగుళాల స్క్రీన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్, 6 జీబీ, 8 జీబీ ర్యామీ, 128 జీబీ స్టోరేజీ దీని ప్రత్యేకతలు. ఎక్కువ సమయం పనిచేసేందుకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.
ఈ 5జీ ఫోన్ కు ఎఫ్ డీడీ ఎన్ 1, ఎన్3, ఎన్5, ఎన్8, ఎన్28తో పాటు టీడీడీ ఎన్38, ఎన్40, ఎన్41, ఎన్77, ఎన్78 బ్యాండ్లు మద్దతు ఇస్తాయి.
కెమెరాకు సంబంధించి వెనుక ప్యానల్ లో 50 ఎంపీ సోనీ సెన్సార్, పోర్ట్రెయిట్ లైన్స్ తో పాటు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్ రూ.15 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.
పనితీరు, డిజైన్ పరంగా ఐక్యూ జె10ఎక్స్ 5జీ ఎంతో ఆకట్టుకుంటోంది.
హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ కలిగిన 6.72 అంగుళాల విశాలమైన డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్, 128 జీబీ స్టోరేజీ, 6 జీజీ మరియు 8 జీబీ ర్యామ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.
4 నానోమీటర్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తయారు చేశారు.
ఫొటో గ్రఫీ కోసం వెనుక 50, 2 మెగా పిక్సల్ కెమెరాలు అమర్చారు.
వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఉంది.
టీడీడీ ఎన్40, ఎన్77, ఎన్78తో పాటు ఎఫ్ డీడీ ఎన్1, ఎన్3, ఎన్5, ఎన్28 బ్యాండ్లకు మద్దతు ఉంటుంది.
6500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.13,499 మాత్రమే.