Mobiles15th Jun 01:34 PMSunil Byrisetty2 min read

ఇన్‌స్టా ప్రియులకు టాప్ 5 మొబైళ్లు ఇవే!

సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ పోస్టు చేసేవారు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి బెస్ట్ ఎంపికలు ఇవే. అత్యుత్తమ కెమెరా క్వాలిటీతో వీడియోలకు అనుకూలమైన ఫోన్లేంటో తెలుసుకుందాం. 1. ఒప్పో

ఇన్‌స్టా ప్రియులకు టాప్ 5 మొబైళ్లు ఇవే!
సోషల్ మీడియాలో వీడియో కంటెంట్ పోస్టు చేసేవారు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసేవారికి బెస్ట్ ఎంపికలు ఇవే. అత్యుత్తమ కెమెరా క్వాలిటీతో వీడియోలకు అనుకూలమైన ఫోన్లేంటో తెలుసుకుందాం. 1. ఒప్పో F29 Pro ఫోన్ 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమన్షిటీ 7300 చిప్‌సెట్‌పై, 50MP బ్యాక్ కెమెరా, పవర్‌ఫుల్ ఫుటేజ్‌లను అందింస్తుంది. 16MP ఫ్రంట్ కెమెరా వైడ్-యాంగిల్ సెల్ఫీ అందిస్తుంది. 6000mAh బ్యాటరీతో ట్రావెల్ కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఫోన్‌గా రూ. 27,999 ధరతో వస్తుంది. 2. వివో V50 ఫోన్ 6.77-అంగుళాల HDR10+ డిస్‌ప్లే కలిగి, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌‌తో వస్తుంది. ట్రిపుల్ 50MP బ్యాక్ కెమెరా సిస్టమ్, 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి హై క్వాలిటీ వీడియోలకు అద్భుతమైన ఫోన్‌గా భారీ 6000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది. 3. షావోమీ 14 Civi ఫోన్ 6.55-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫొటో పరంగా డ్యూయల్ 50MP బ్యాక్ లెన్స్, 32MP సెల్ఫీ, అల్ట్రావైడ్ సెన్సార్‌లతో కంటెంట్ క్రియేటర్లకు బాగుంటుంది. 4700mAh బ్యాటరీతో వస్తోంది. 4. రియల్‌మి GT 7T ఫోన్ 6.8-అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్‌, మీడియాటెక్ డైమన్షిటీ 8400 మ్యాక్స్ ప్రాసెసర్‌తో వస్తోంది. క్రిస్టల్-క్లియర్ వీడియో కంటెంట్ కోసం 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 7000mAh అతిపెద్ద బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అందుబాటులో ఉంది. 5. శాంసంగ్ గెలాక్సీ A36 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌తో లభిస్తోంది. 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్, 12MP ఫ్రంట్ కెమెరాతో మల్టీఫేస్ వీడియో షూటింగ్‌కు సరైనది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీతో వస్తుంది.
Smart mobiles
Instagram reels
best camera quality
Oppo F29 Pro
Vivo V50
Xiaomi 14 Civi
realmi GT 7T
Samsung galaxy A36
Scroll for the next article