Mobiles31st Dec 03:44 PMSunil Byrisetty1 min read
2025లో దుమ్మురేపిన మొబైల్స్ ఇవే..!
2025లో అనేక మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హైఎండ్ కెమెరాలు, దీర్ఘకాల బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్న మొబైళ్లు భారీగా అమ్ముడయ్యా
2025లో అనేక మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హైఎండ్ కెమెరాలు, దీర్ఘకాల బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, 5జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లున్న మొబైళ్లు భారీగా అమ్ముడయ్యాయి. 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ మొబైల్స్ ఏమిటో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన మొబైల్‌గా ఆపిల్ ఐఫోన్-16 ప్రో మ్యాక్స్ నిలిచింది. ఐఫోన్-16 ప్రో మ్యాక్స్ తర్వాత అత్యధికంగా అమ్ముడైన ఫోన్ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 అల్ట్రా రెండో స్థానంలో నిలిచింది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, AMOLED 2ఎక్స్ డిస్‌ప్లే, S-పెన్ సపోర్ట్ ఫీచర్లు ఆకర్షణగా నిలిచాయి. ఏఐ ఆధారిత ఫీచర్లతో ముందుకు వచ్చిన గూగుల్ పిక్సెల్-10 ప్రో కూడా 2025లో టాప్ సెల్లింగ్ జాబితాలో స్థానం దక్కించుకుంది. రియల్ టైమ్ ట్రాన్స్‌లేషన్, స్మార్ట్ ఫోటో ఎడిటింగ్, వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లు ఉన్నాయి. స్టాక్ ఆండ్రాయిడ్ ను ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఛాయిస్‌గా మారింది. ఇక ధరకు తగిన ఫీచర్లతో మార్కెట్‌లో దూసుకెళ్లిన ఫోన్‌గా షియోమీ 14 అల్ట్రా కూడా భారీగా విక్రయించబడింది. 120W ఫాస్ట్ చార్జింగ్, పవర్‌ఫుల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీతో ఈ ఫోన్ భారత మార్కెట్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.