Politics23rd Mar 02:16 PMSunil Byrisetty1 min read

పార్లమెంటు PAC సభ్యులుగా ఏపీ ఎంపీలు

పార్లమెంటులో కీలకమైన కమిటీ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ. ఈ కమిటీకి సభ్యులుగా ఎంపిక కావాలని ఎంపీలంతా ఆకాంక్షిస్తారు. కీలక ఈ కమిటీ సభ్యులు దేశ ఆదాయం, వ్యయాలకు సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్య

పార్లమెంటు PAC సభ్యులుగా ఏపీ ఎంపీలు
పార్లమెంటులో కీలకమైన కమిటీ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ. ఈ కమిటీకి సభ్యులుగా ఎంపిక కావాలని ఎంపీలంతా ఆకాంక్షిస్తారు. కీలక ఈ కమిటీ సభ్యులు దేశ ఆదాయం, వ్యయాలకు సంబంధించిన వ్యవహారాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. అన్ని రాష్ట్రాల ఎంపీలు ఆశించే ఈ కమిటీలో ఏపీకి సంబంధించిన ముగ్గురు ఎంపీలు స్థానం సాధించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరిలు ఎన్నికయ్యారు. ఈ కమిటీలోని 15 స్థానాలకు జరిగిన ఎన్నికకు మొత్తం 22 మంది సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. అందులో ఏడుగురు సభ్యులు పోటీ నుంచి తప్పుకోవడంతో 15 మంది సభ్యుల ఎన్నిక ఏకగీవ్రంగా జరిగింది. ఏపీ ఎన్డీయేలోని 3 పార్టీలకు కమిటీలో చోటు లభించింది.
Parliament PAC
MP Cm Ramesh
MP Magunta Srinivasulu Reddy
Jana Sena MP Vallabhaneni Balashouri
Scroll for the next article