Crime3rd Jun 11:33 AMSunil Byrisetty1 min read

కర్ణాటకలో బ్యాంకుకే కన్నం.. 59 కిలోల బంగారం!

కర్ణాటకలోని ఓ బ్యాంకులో 59 కిలోల బంగారం చోరీ జరిగింది. కర్ణాటక విజయపుర జిల్లా మంగోలిలోని కెనరా బ్యాంకులో ప్రజలు తాకట్టు పెట్టిన 59 కిలోల బంగారం చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి

కర్ణాటకలో బ్యాంకుకే కన్నం.. 59 కిలోల బంగారం!
కర్ణాటకలోని ఓ బ్యాంకులో 59 కిలోల బంగారం చోరీ జరిగింది. కర్ణాటక విజయపుర జిల్లా మంగోలిలోని కెనరా బ్యాంకులో ప్రజలు తాకట్టు పెట్టిన 59 కిలోల బంగారం చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చోరీపై మే 26న బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 23న సాయంత్రం బ్యాంకుకు తాళం వేశారు. 24, 25 సెలవులు కాగా, 26న గుమస్తా బ్యాంకుకు వెళ్లగా షట్టర్ తాళం కట్ చేసి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు 8 బృందాలతో దొంగల కోసం గాలిస్తున్నారు.
Karnataka news
Crime
Gold
theft
canara bank Mangoli branch
59 కిలోల బంగారం చోరి
కర్ణాటక బ్యాంకు
Scroll for the next article