News3rd Apr 09:44 AMSunil Byrisetty1 min read
అసెంబ్లీలో దొంగలు పడ్డారు!
జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్‌లో కాకుండా హైసెక్యూరిటీలో ఉన్న అసెంబ్లీలో సైతం దొంగలు పడ్డారు. ఏకంగా శాసన మండలి సభ్యుల దగ్గరే కత్తిరి
జేబుదొంగలు రెచ్చిపోతున్నారు. రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్‌లో కాకుండా హైసెక్యూరిటీలో ఉన్న అసెంబ్లీలో సైతం దొంగలు పడ్డారు.
ఏకంగా శాసన మండలి సభ్యుల దగ్గరే కత్తిరించేశారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకున్న విషయం తెలిసిందే.
ముగ్గురు టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు.
ఆ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా శాసనసభ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు.
టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10 వేలు, ఆయన గన్మన్ జేబులో ఉన్న రూ.40 వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50 వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేశారు. మొత్తం రూ.4 లక్షలు చోరీ అయినట్లు భావిస్తున్నారు. హైసెక్యూరిటీ జోన్లో జరిగిన ఈ చోరీలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.