Politics24th Oct 12:49 PMSunil Byrisetty1 min read
మళ్లీ తెరపైకి థర్డ్ ఫ్రంట్?
దేశంలో మరోసారి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయం త్వరలోనే రూపుదిద్దుకునే
దేశంలో మరోసారి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో సరికొత్త రాజకీయ ప్రత్యామ్నాయం త్వరలోనే రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ మళ్లీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దీని వెనుక తెరపైకి వస్తున్న సరికొత్త రాజకీయ సమీకరణం.. బీఆర్ఎస్, వైఎస్సార్సీపీల ఉమ్మడి ఎత్తుగడగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయి, అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి మళ్లీ థర్డ్ ఫ్రంట్ నినాదాన్ని తెరపైకి తేనున్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ ఏపీలో ఎన్డీయే కూటమిపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ, కేంద్ర వైఖరిని లోపాయికారీగా వ్యతిరేకిస్తున్నారు. కానీ కాంగ్రెస్ వైపు అడుగు వేసే పరిస్థితి ఎంతమాత్రం లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ చేతిలో అధికారం కోల్పోయిన కేసీఆర్ కాంగ్రెస్తో విభేదిస్తున్నారు. కనుక ఈ ఇద్దరు మాజీ సీఎంలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది.