News2nd Jan 11:42 AMSunil Byrisetty1 min read

శ్రీహరికోటలో మూడో రాకెట్ ప్రయోగ వేదిక

శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం-షార్‌లో మూడో ప్రయోగ వేదికను ఏర్పాటు చేయనుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు శ్రీహరికోట నుంచే రా

శ్రీహరికోటలో మూడో రాకెట్ ప్రయోగ వేదిక
శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం-షార్‌లో మూడో ప్రయోగ వేదికను ఏర్పాటు చేయనుంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు శ్రీహరికోట నుంచే రాకెట్‌ ప్రయోగాలు చేపడుతూ వస్తోంది. ఇప్పటికే ఇక్కడ రెండు లాంచ్‌ ప్యాడ్‌లు ఉండగా మరో నాలుగేళ్లలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న లాంచ్‌ ప్యాడ్‌ల కంటే పెద్దగా దీన్ని నిర్మించనుంది. 12,000 కిలోల నుంచి 14,000 కిలోల బరువుండే భారీ ఉపగ్రహాలను ప్రవేశపెట్టాలనే ప్రణాళికల్లో ఉన్న ఇస్రోకు.. భారీ ప్రయోగ వాహనాలు (రాకెట్లు) అవసరమని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం-షార్‌ డైరెక్టర్‌, ప్రముఖ శాస్త్రవేత్త ఈఎస్‌ పద్మకుమార్‌ తెలిపారు. ఈ రాకెట్‌ ప్రయోగాలకు అనువుగా మూడో ప్రయోగ వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఇది అందుబాటులోకి వస్తే దాని నుంచి నెక్ట్స్‌ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్స్‌ ద్వారా 14,000 కిలోలకంటే బరువైన ఉపగ్రహాలను ప్రయోగిస్తామని చెప్పారు.
Sriharikota
Satish Dhawan Space Centre
ISRO
Third Launch Pad
Rocket Launch Facility
ఉపగ్రహ ప్రయోగాలు
భారీ ప్రయోగ వాహనాలు
అంతరిక్ష పరిశోధనలు
Scroll for the next article