Health17th Jan 03:49 PMSunil Byrisetty1 min read
ఈ సహజ చక్కెర.. సుగర్ పెంచదు!
మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్న వారికి శాస్త్రవేత్తలు సుగర్ పెంచని తీపి కబురు అందించారు. సాధారణ చక్కెరలా తీయగా ఉంటూనే, రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను పెంచని సహజ చక్కెరను క
మధుమేహం, ఊబకాయంతో బాధపడుతున్న వారికి శాస్త్రవేత్తలు సుగర్ పెంచని తీపి కబురు అందించారు. సాధారణ చక్కెరలా తీయగా ఉంటూనే, రక్తంలో గ్లూకోజ్ లేదా ఇన్సులిన్ స్థాయిలను పెంచని సహజ చక్కెరను కనుగొన్నారు. 'టాగటోజ్' అని పిలిచే ఈ చక్కెర, ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని నిపుణులు భావిస్తున్నారు. పండ్లు, పాల ఉత్పత్తుల్లో స్వల్ప పరిమాణంలో లభించే సహజ చక్కెర టాగటోజ్. దీని రుచి పంచదారలానే ఉంటుంది కానీ, కేలరీల విషయంలో మాత్రం కేవలం 40 శాతం మాత్రమే ఉంటుంది. ముఖ్యంగా, దీన్ని తీసుకున్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. దీంతోపాటు దంత క్షయానికి కూడా కారణం కాదు. దీంతో టాగటోజ్ పంచదారకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కానుంది. అలాగే దీని తయారీ కూడా తక్కువ ఖర్చుతోనే కానుంది.