News3rd Oct 11:25 AMSunil Byrisetty1 min read
విజయవాడ ఉత్సవ్ లో తోలు బొమ్మలాట కనువిందు
విజయవాడ ఉత్సవ్ లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు 11వ రోజు తోలు బొమ్మలాట కనువిందు చేసింది. కాకినాడ కరపకు చెందిన తోట దావీదు బృందం ఈ తోలుబొమ్మలాట వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్
విజయవాడ ఉత్సవ్ లో భాగంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు 11వ రోజు తోలు బొమ్మలాట కనువిందు చేసింది. కాకినాడ కరపకు చెందిన తోట దావీదు బృందం ఈ తోలుబొమ్మలాట వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో "సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ" సారధ్యంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టీవ్ కార్నివల్ "విజయవాడ ఉత్సవ్" నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు కడపకు చెందిన శ్రీ విఘ్నేశ్వర తోలు బొమ్మలాట కళా బృందం తోట దావీదు ఆధ్వర్యంలో ప్రదర్శించిన తోలుబొమ్మలాట కనువిందు చేసింది. తోట దావీదు బృందం ప్రదర్శించిన రామాయణంలోని మయ రావణ తోలు బొమ్మలాట ప్రేక్షకులను భక్తి పారవశ్యంలో ముంచింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికపై ఆనందంతో పాటు ఆధ్యాత్మికత సంతరించుకునేలా చేసింది.