International4th Oct 10:04 AMSunil Byrisetty1 min read
పీవోకేలో తిరుగుబాటు.. భారత్‌లో కలిసిపోతుందా?
పాకిస్తాన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇప్పుడు ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజలంతా పాక్ ప్రభుత్వంపై తిరుగబడుతున్నారు. ప్రజల్ని కట్టడి చేయడానికి పా
పాకిస్తాన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇప్పుడు ప్రజా తిరుగుబాటు మొదలైంది. ప్రజలంతా పాక్ ప్రభుత్వంపై తిరుగబడుతున్నారు. ప్రజల్ని కట్టడి చేయడానికి పాకిస్తాన్ పెద్ద ఎత్తున సైన్యాన్ని పంపింది. వారు ఆందోళనలపై కాల్పులు జరిపి కొంత మందిని పొట్టనబెట్టుకున్నారు. తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద 30కిపైగా డిమాండ్లు పెట్టారు. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం చర్చలకు కమిటీని నియమించిది. ఆ డిమాండ్లను తీర్చేంత శక్తి పాక్ ప్రభుత్వం వద్ద లేదు. అక్కడ జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ స్పందించింది. వాటికి పాకిస్తాన్ ను బాధ్యత వహించేలా చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. అలాగే ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకుని మన దేశంలోకి కలిపేసుకుంటుందా అనే చర్చ మొదలైంది.