Telangana14th Jun 11:50 AMSunil Byrisetty1 min read
ఎమ్మెల్యేను చంపేస్తామంటూ కాల్స్
తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌కు గతంలోనూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా మరోసారి బెద
తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌కు గతంలోనూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. తాజాగా మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని, బాంబులతో దాడి చేస్తామని, కుటుంబాన్ని కూడా అంతం చేస్తామని బెదిరించారు. గత వారం రోజులుగా కాల్స్ వస్తున్నాయని, 9 వేర్వేరు నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. పోలీసుల నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.