Entertainment12th Nov 05:37 PMSunil Byrisetty1 min read
సూర్య స్పీడ్ అందుకోగలరా?
ఒకే ఏడాదిలో సూర్య మూడు సూపర్ హిట్స్ అందుకోవడం చూసి ఇతర హీరోలు ఈర్ష్య పడుతున్నారంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండేళ్లకు ఒక విజయం దక్కించుకోవడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో
ఒకే ఏడాదిలో సూర్య మూడు సూపర్ హిట్స్ అందుకోవడం చూసి ఇతర హీరోలు ఈర్ష్య పడుతున్నారంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. రెండేళ్లకు ఒక విజయం దక్కించుకోవడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో సూర్య సాధించిన ఫీట్ చాలా గొప్పది. వీరభద్రుడు అలియాస్ కరుప్పు మూడు వందల కోట్లు సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ రెండు వందల యాభై కోట్ల మార్కుని చేరుకుంది. తాజాగా సీన్ ఆల్రెడీ నూటా యాభై కోట్లను దాటేసి కొత్త టార్గెట్లు పెట్టుకుంటోంది. అది కూడా రామాయణ లాంటి ప్యాన్ ఇండియా పోటీని ఎదురుగా పెట్టుకుని. మూడు సంబంధం లేని వేర్వేరు జానర్లు. అన్నింటిలో సూర్యని ఆదరించారు. రెట్రో, కంగువ మిగిల్చిన తీవ్రమైన గాయాలకు అద్భుతమైన ముందుగా పని చేశాయి. ఈ నేపథ్యంలో సూర్య నుంచి నేర్చుకోవాల్సినవేంటంటే స్పీడ్, తక్కువ టైంలో ఎక్కువ బడ్జెట్, రిస్కులు లేకుండా సరైన ప్లానింగ్. అవన్నీ ఉంటే చెప్పిన టైంకి సినిమాలు రిలీజ్ చేయొచ్చని సూర్య నిరూపించాడు.