News24th May 11:34 AMSunil Byrisetty1 min read
బెంజ్ సర్కిల్ సమీపంలో అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి
విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ భవనంలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ఒకర
విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ సమీపంలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ఓ భవనంలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం.
మృతుల్లో ఒకరి పేరు ముత్యాలమ్మగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు సేకరిస్తున్నారు.
అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
కొద్ది రోజులుగా వరుస ప్రమాదాలు జరుగుతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.