News25th Mar 01:28 PMSunil Byrisetty1 min read
దంతెవాడలో ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోలు మృతి
దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. 2026 నాటికి మావోయిస్టు రహితంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావో ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా
దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది. 2026 నాటికి మావోయిస్టు రహితంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మావో ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి.
ఈ క్రమంలో తాజాగా మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగింది.
ఇందులో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారు.
ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
కాగా ఇటీవల పలు ఎన్కౌంటర్లలో భారీగా మావోలు మరణించిన విషయం తెలిసిందే.