News18th Dec 12:24 PMSunil Byrisetty1 min read
గుంటూరులో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
గుంటూరులో ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇంటి పన్ను రశీదులో పేరు మార్పిస్తామని, అనధికారక నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ముగ్గురు ఉద్యోగులపై జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాస
గుంటూరులో ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఇంటి పన్ను రశీదులో పేరు మార్పిస్తామని, అనధికారక నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న ముగ్గురు ఉద్యోగులపై జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు చర్యలు తీసుకున్నారు. అక్రమ వసూళ్లపై అందిన ఫిర్యాదులతో సంగడిగుంటలోని సచివాలయం 45లో డేటా ఎంట్రీ ఆపరేటర్ సాయికుమార్ పైన, అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్నారని కాకాని రోడ్డులో ఇన్చార్జి టీపీబీఓ యాసిర్ అహ్మద్, ప్లానింగ్ సెక్రటరి ఆవుల వెంకటకృష్ణలను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్, సచివాలయ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినా, అనధికారికంగా డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో గుంటూరులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.