Education25th Oct 04:40 PMSunil Byrisetty1 min read

“ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు – స్వదేశీ, స్వభాషా, స్వభూష”

ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించాలని, వికసిత్ భారత్ సాధనలో అందరం పునరంకితం అవుదామని ఆం.ప్ర రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ

 “ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు – స్వదేశీ, స్వభాషా, స్వభూష”
ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులు దేశీయంగా తయారు చేయడానికి మనం అందరం ప్రోత్సహించాలని, వికసిత్ భారత్ సాధనలో అందరం పునరంకితం అవుదామని ఆం.ప్ర రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం అనంతపురం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో “ఆత్మనిర్భర్ భారత్” అంశంపై మంత్రి సత్యకుమార్ యాదవ్‌ విశిష్ట ఉపన్యాసం ఇచ్చారు. తన ప్రసంగంలో ఆయన “ఆత్మనిర్భర్ భారత్‌కు మూడు స్తంభాలు స్వదేశీ, స్వభాషా మరియు స్వభూష” అని పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ మూడు అంశాల ప్రాధాన్యాన్ని వివరించిన ఆయన, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని, తల్లిభాషపై గర్వం కలిగి ఉండాలని, మన సంస్కృతి, వారసత్వాన్ని విలువైనదిగా భావించాలని సూచించారు. భారతదేశం చారిత్రాత్మకంగా స్వయం సమృద్ధి కలిగిన దేశమని, ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారుగా నేడు నిలిచిందని ఆయన అన్నారు. అయితే, వెయ్యి సంవత్సరాల విదేశీ పాలన తర్వాత మనం దిగుమతులపై ఆధారపడే పరిస్థితికి చేరామని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత భారత్ ప్రపంచంలోని మూడవ అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని ఆయన అన్నారు.
Andhra Pradesh Central University
Aatmanirbhar Bharat
Satya Kumar Yadav
Swadeshi
Swabhasha
Swabhusha
Viksit Bharat
Anantapur
Self-Reliant India
వికసిత్ భారత్
అనంతపురం
స్వయం సమృద్ధి
విద్య
Scroll for the next article