Politics9th Mar 12:27 PMSunil Byrisetty1 min read
వైసీపీ నుంచి టీడీపీకి.. మళ్లీ సొంతగూటికి!
ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు వైయస్సార్సీపీ నుంచి టిడిపిలో చేరారు. వారిలో ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం తిరిగి సొంతగూడు వైఎస్సార్సీపీలో చేరారు. రాగల శాంతి(8వ వార్డ
ఇటీవల ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు వైయస్సార్సీపీ నుంచి టిడిపిలో చేరారు.
వారిలో ముగ్గురు కౌన్సిలర్లు ఆదివారం తిరిగి సొంతగూడు వైఎస్సార్సీపీలో చేరారు.
రాగల శాంతి(8వ వార్డు), రావులకొల్లు అరుణ (40వ వార్డు), చింపిరి అనిల్ కుమార్ (39వ వార్డు) ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేతులమీదుగా పార్టీ కండువా వేసుకొని వైసీపీలోకి వచ్చారు.
ఇలా టీడీపీలోకి వెళ్లి, అలా వైసీపీలోకి తిరిగి రావడం సంచలనంగా మారింది.
అధికార పార్టీలో చేరి, మళ్ళీ వెనక్కి రావడం కడప జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.