Politics21st Mar 09:54 AMSunil Byrisetty1 min read
కష్టాల్లో వైసీపీ.. వినుకొండలో ముగ్గురి సస్పెన్షన్
గతేడాది వరకు అధికారాన్ని అనుభవించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా మాజీ మంత్రులు, సీనియర్లు పార్టీని వీడి వెళ్తున్నారు. ఎక్కు
గతేడాది వరకు అధికారాన్ని అనుభవించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది.
ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా మాజీ మంత్రులు, సీనియర్లు పార్టీని వీడి వెళ్తున్నారు.
ఎక్కువమంది జనసేన వైపు చూస్తుండగా.. కొందరు టీడీపీలో చేరుతున్నారు.
ఇలా పార్టీని వీడి వెళ్తున్న వారే కానీ పార్టీలో చేరేవారు కనిపించడం లేదు.
అలాంటి పరిస్థితుల్లో పలువురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
జగన్ ఆదేశాల మేరకు వినుకొండ నియోజకవర్గంలో పలువురు పార్టీ నాయకులను సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదులపై పార్టీ క్రమశిక్షణా కమిటీ సిఫార్సుల మేరకు ఈపూరు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చుoడూరి వెంకటేశ్వర్లు, ఈపూరు మండల నాయకులు శాఖమూరి బుచ్చయ్య చౌదరి, ఆ నూజెండ్ల మాజీ కన్వీనర్ నక్కా నాగిరెడ్డిలను సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారంతా పార్టీని వీడి ప్రత్యామ్నాయ పార్టీల్లో చేరాలని భావిస్తు్న్నారని ప్రచారం జరుగుతోంది.