News11th Aug 02:44 PMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై త్రయాహ్నిక వరుణ యాగం

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను నివారించి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక వైదిక పూజలు నిర్వహించ

ఇంద్రకీలాద్రిపై త్రయాహ్నిక వరుణ యాగం
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను నివారించి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక వైదిక పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. 14వ తేదీ శుక్రవారం నుంచి 16వ తేదీ ఆదివారం వరకు 3 రోజుల పాటు త్రయాహ్నిక దీక్షాపూర్వకంగా "వరుణ యాగములు, వరుణ జపములు", ఘటాభిషేకములు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, వరుణ అనువాక సహిత కారక పారాయణలు, పుణ్యాహవాచనం, వరుణ, ఋష్య శృంగ, నవగ్రహ, అష్ట దిక్పాలకులకు పురుష సూక్త విధానాన పూర్వక పూజలు, గణపతి, ఇంద్ర, వరుణ, ఋష్య శృంగ, మండప దేవతా ఆవాహనలు, మండప పూజలు నిర్వహిస్తారు. రెండవ రోజు వరుణ అనువాక కార్యక్రమము, రుద్రహోమం. వివిధ హోమములు, మండప దేవతా హోమములు, విశేష పూజలు నిర్వహిస్తారు. మూడవ రోజు దుర్గాఘాట్ నుండి పవిత్ర కృష్ణానదీ జల గ్రహణం, శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో మహాన్యాస పారాయణం, శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో "ఘటాభిషేకం", శత అనువాహక, కారక పారాయణాలు, మండప దేవతా హోమములు, జయాదులు, అనంతరం "మహా పూర్ణాహుతి" తో ఉత్సవ సమాప్తి జరగనుంది.
Andhra Pradesh
Indrakeeladri
Varuna Yagam
Varuna Japam
Vijayawada
Kanaka Durga Temple
Durga Malleswara Temple
Rainfall
Rain Deficit
Hindu Rituals
కృష్ణానది
ఘటాభిషేకం
మహాన్యాస పారాయణం
మహా పూర్ణాహుతి
Scroll for the next article