Telangana19th Aug 02:15 PMSunil Byrisetty1 min read
టికెట్ ధరలు పెంచితే విరాళమివ్వాలి
సినిమా టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20% TGFDCకి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 20% వాటాను ఎగ
సినిమా టికెట్ ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది.
టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20% TGFDCకి సంక్షేమ విరాళంగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 20% వాటాను ఎగ్జిబిటర్ల నుంచి నిర్మాతలే వసూలు చేయాలని ఆదేశించింది. 'అఖండ-2, ది రాజాసాబ్, పెద్ది, మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలకు ప్రభుత్వ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 14 రీల్స్ ప్లస్ LLP, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, షైన్ స్క్రీన్స్ ఇండియా LLPతో పాటు వృద్ధి సినిమాస్ LLPలకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.