Health22nd Dec 04:20 PMSunil Byrisetty1 min read
7 సెకండరీ ఆసుపత్రుల్లో తొలిసారిగా టిఫా స్కానింగ్ సౌకర్యం
గర్భిణులు, శిశు సంరక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని 7 సెకండరీ అసుపత్రుల్లో 'టిఫా' (Targeted Imaging for Fetal Anomalies-TIFFA) స్కానింగ్ సౌకర్యాన్ని అంద
గర్భిణులు, శిశు సంరక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రంలోని 7 సెకండరీ అసుపత్రుల్లో 'టిఫా' (Targeted Imaging for Fetal Anomalies-TIFFA) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. నర్సీపట్నం, తుని, నందిగామ ఏరియా ఆసుపత్రుల్లో, ఒంగోలులోని ఎంసీహెచ్ (మాతా, శిశు వైద్యశాల), పార్వతీపురం, తెనాలి, అనకాపల్లి జిల్లా ఆసుపత్రుల్లో టిఫా స్కానింగులను సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం వాటి పనితీరును పరిశీలిస్తున్నామని తెలిపారు. జనవరి 1 నుంచి స్కానింగ్ సేవలు పూర్తిస్థాయిలో గర్భిణులకు అందుబాటులో వస్తాయని చెప్పారు. ఒక్కొక్క టిఫా స్కానింగ్ ఖరీదు రూ.30.48 లక్షల చొప్పున ఏడింటికి కలిపి రూ.2.13 కోట్ల వరకు వ్యయంచేసినట్లు మంత్రి తెలిపారు. గర్భిణుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసిన ఈ 7 ఆసుపత్రుల్లో మూడు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. దీనివల్ల గిరిజన మహిళలకు ఆధునిక వైద్య సేవలు మరింత అందుబాటులోనికి వచ్చినట్లయింది.