Telangana15th Nov 11:54 AMSunil Byrisetty1 min read
జీలుగుమిల్లిలో టైగర్ హల్చల్!
ఏపి- తెలంగాణ సరిహద్దులో పెద్ద పులి హల్చల్ చేస్తోంది. అశ్వారావుపేటకు సమీపంలో ఉన్న జీలుగుమిల్లిలో టైగర్ సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగ
ఏపి- తెలంగాణ సరిహద్దులో పెద్ద పులి హల్చల్ చేస్తోంది.
అశ్వారావుపేటకు సమీపంలో ఉన్న జీలుగుమిల్లిలో టైగర్ సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జీలుగుమిల్లి సెంటర్‌లోని దుర్గమ్మ ఆలయం వెనుక నుంచి పాలచర్ల వెళ్లే రహదారిపై పులి కనిపించినట్లు సమాచారం. గ్రామంలోని నివాస ప్రాంతాలకు సమీపంలోనూ పులి సంచరించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో పులి కదలికలకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదైనట్లు తెలియడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకూడదని, అటవీ ప్రాంతాలకు సమీపంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.