Spiritual27th Nov 04:42 PMSunil Byrisetty1 min read

భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

దసరా విజయవంత స్పూర్తితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనభాగ్యం క

భవానీ దీక్షా విరమణలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
దసరా విజయవంత స్పూర్తితో భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు భవానీ భక్తులు సంతృప్తి చెందేలా అమ్మవారి దర్శనభాగ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖరబాబు అధికారులకు సూచించారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించన్ను భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు, మున్సిపల్ కమిషనర్ హెచ్ ఎం ధ్యానచంద్ర, ఆలయ ఈవో వి.కె. శ్రీనానాయక్లు సమన్వయ శాఖల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భవానీ భక్తులు తరలివస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. అయిదు రోజుల పాటు భవానీ దీక్షా విరమణలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి రోజు దాదాపు లక్ష వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. చివరి రెండు రోజుల్లో దాదాపు లక్షా 50 వేల మంది భవానీ భక్తులు రానున్న దృష్టి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా భక్తుల హెూల్డింగ్ పాయింట్లు కేశఖండన ప్రదేశాలు, స్నాన ఘట్టాలు, గిరిప్రదర్శన, క్యూ లైన్లు, ఇరుముడుల సమర్పణ, హోమ గుండం, లడ్డు విక్రయ కేంద్రాలకు సంబంధించిన సెక్టార్ అధికారులు అత్యంత అప్రమత్తంతో పనులు పూర్తి చేసేలా పర్యవేక్షించాలన్నారు. భవానీ భక్తుల దీక్షా వస్త్రాలను స్నాన ఘట్టాల వద్ద వదిలివేస్తారని ఆయా ప్రాంతాలలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వస్త్రాలను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Andhra Pradesh
Bhavani Deeksha
Bhavani Deeksha Relinquishment
Vijayawada
Kanaka Durga Temple
District Collector Lakshmisha
Police Commissioner Rajasekhar Babu
దసరా స్పూర్తి
స్నాన ఘట్టాలు
క్యూ లైన్లు
కేశఖండన
గిరిప్రదర్శన
Scroll for the next article