Politics23rd Oct 05:11 PMSunil Byrisetty1 min read

MPTC, ZPTC నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ గ

MPTC, ZPTC నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
ప్రకాశం జిల్లాలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ గారు పొన్నలూరు, కందుకూరు తదితర మండలాల్లోని నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు, బారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థులు, వారి ప్రతినిధుల వాహనాలు రాకపోకలను సమీక్షించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో నిబంధనల ప్రకారం భద్రత అమలు చేయాలని, అనుమతి లేని వాహనాల రాకపోకలు, పార్కింగ్‌ను నియంత్రించాలని స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా చేరకుండా, అనుమతి లేని ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Scroll for the next article