News28th Oct 01:04 PMSunil Byrisetty1 min read
ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత
ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్
ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు (ఈవీఎం), వీవీప్యాట్ల గోదాముకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సాధారణ నెలవారీ తనిఖీల్లో భాగంగా విజయవాడ గ్రామీణం, గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ల గోదామును కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రపరుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని సూచించినట్లు పేర్కొన్నారు.