News13th Nov 04:33 PMSunil Byrisetty1 min read

విశాఖ సదస్సుకు భారీ భద్రత: హోంమంత్రి అనిత

విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. దాదాపు 3,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు

విశాఖ సదస్సుకు భారీ భద్రత: హోంమంత్రి అనిత
విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. దాదాపు 3,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడబోదని తేల్చిచెప్పారు. సదస్సుకు హాజరయ్యే ప్రతి వీఐపీ విమానాశ్రయంలో అడుగుపెట్టినప్పటి నుంచి తిరిగి వారి గమ్యస్థానాలకు చేరేంత వరకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే బాధ్యతను పోలీసు శాఖ తీసుకుందని అనిత వివరించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అప్రమత్తత ప్రకటించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తీవ్రవాదంతో పాటు "రాజకీయ ఉగ్రవాదం" పైనా తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉందని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. విశాఖ సదస్సుపై జగన్ బ్యాచ్ సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాన్ని ఉపేక్షించేది లేదని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ఇలాంటి చర్యలను కఠినంగా అణచివేస్తామన్నారు.
Andhra Pradesh Police
Visakhapatnam Summit
Security Arrangements
Home Minister Anitha
Partnership Summit
VIP Security
Delhi Blast Aftermath
తీవ్రవాదం
రాజకీయ ఉగ్రవాదం
సోషల్ మీడియా ప్రచారం
రాష్ట్ర ప్రతిష్ఠ
Scroll for the next article