News29th Sep 03:43 PMSunil Byrisetty1 min read
లోకేశ్ అన్నా.. నీకో స్పెషల్ గిఫ్ట్.. తిలక్ వర్మ సర్‌ప్రైజ్
ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించడం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించి 9వ సారి కప్ కైవసం చేసుకోవడంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ప్రధాన పాత్ర పోషి
ఆసియా కప్-2025 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయం సాధించడం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఓడించి 9వ సారి కప్ కైవసం చేసుకోవడంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ ప్రధాన పాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ అనంతరం ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. తన క్యాప్ ను తిలక్ వర్మ ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు కానుకగా ఇచ్చాడు. లోకేశ్ అన్నా ఇది నీకోసమే.. ప్రేమతో ఇస్తున్నాను అంటూ ఆ క్యాప్ పై రాసి సైన్ చేశాడు. ఈ మేరకు వీడియో పంపించాడు. దీనిపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తిలక్ వర్మ అభిమానం తనను ముగ్ధుడ్ని చేసిందని పేర్కొన్నాడు. "తమ్ముడూ.. నీ ప్రేమ పట్ల ఎంతో సంతోషిస్తున్నాను. నువ్వు భారత్ తిరిగిరాగానే ఆ క్యాప్ ను నీ చేతుల మీదుగా అందుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తుంటాను.. నువ్వు ఛాంపియన్" అంటూ ట్వీట్ చేశారు.