Sports24th Oct 05:51 PMSunil Byrisetty1 min read

తిలక్‌ వర్మ ప్రపంచ రికార్డు

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మసరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ ర

తిలక్‌ వర్మ ప్రపంచ రికార్డు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత టీ20 జట్టు వైస్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మసరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలెండర్‌ ఏడాదిలో ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో శనివారం ఈ ఘనత సాధించాడు. క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో టిమ్‌ సీఫర్ట్‌ ఇచ్చిన క్యాచ్‌ను తిలక్‌ వర్మ అందుకున్నాడు. అనంతరం మూడో ఓవర్‌ చివరి బంతికి భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో డారిల్‌ మిచెల్‌ ఇచ్చిన క్యాచ్‌ను కూడా ఒడిసిపట్టాడు. దీంతో తిలక్‌ వర్మ అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Scroll for the next article