News13th Nov 02:52 PMSunil Byrisetty1 min read

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానం, పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం సాధిస్తోన్న పురోగతిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పేలా విశాఖపట్నంలో ‘టైమ్ ఇంపాక్ట్ డిన్నర్’ కార్యక్రమం నిర్వహించారు. సీఐఐ పార్ట

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఏపీ అభివృద్ధి ప్రస్థానం, పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం సాధిస్తోన్న పురోగతిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పేలా విశాఖపట్నంలో ‘టైమ్ ఇంపాక్ట్ డిన్నర్’ కార్యక్రమం నిర్వహించారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ సందర్భంగా గురువారం రాత్రి ది పార్క్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘టైమ్’ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డామియన్ డగ్లస్‌తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. సుమారు 100 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార, ప్రభుత్వ రంగ ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులకు సానుకూల వాతావరణం, వేగవంతంగా ప్రాజెక్టుల అమలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు తన అభిప్రాయాలను పంచుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, పరిశ్రమల స్థాపన, ప్రాజెక్టులు వేగంగా గ్రౌండింగ్ అవ్వడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ హబ్ ఏర్పాటుకు 2025 అక్టోబర్‌లో ప్రకటించగా, కేవలం ఆరు నెలల్లోనే 2026 ఏప్రిల్‌లో శంకుస్థాపన జరిగిందని ముఖ్యమంత్రి వివరించారు.
Scroll for the next article