Farmers10th Aug 05:53 PMSunil Byrisetty1 min read

పొగాకు రైతుల్ని ఆదుకోవాల్సిన సమయం ఇది

పొగాకు రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పొగాకు వ్యాపారులు, కంపెనీలు, పొగాకు బోర్డు అధికారులదేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్

పొగాకు రైతుల్ని ఆదుకోవాల్సిన సమయం ఇది
పొగాకు రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విషయంలో ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పొగాకు వ్యాపారులు, కంపెనీలు, పొగాకు బోర్డు అధికారులదేనని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గుంటూరు టుబాకో బోర్డులో పొగాకు కొనుగోలు వ్యాపారులు, రైతులతో మంత్రులు అచ్చెన్నాయుడు, డీబీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ సమావేశమయ్యారు. పొగాకు వ్యాపారులు, కొనుగోలు కంపెనీలు, టుబాకో బోర్డు అధికారుల తీరుపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నాలుగు సంవత్సరాలుగా పొగాకు వ్యాపారులు గణనీయమైన లాభాలు ఆర్జించారని గుర్తు చేశారు. రైతులు నష్టాల్లో ఉంటే వారిని ఆదుకోవడానికి ముందుకు రావడం లేదని వ్యాపారుల‌ను విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో గ‌తంలో జరిగిన క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌ల‌ ఒప్పందాలను వ్యాపారులు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర విష‌యంలో గ‌తంలో జ‌రిగిన‌ ఒప్పందాలను అమలు చేయాల్సిన బాధ్యత పొగాకు బోర్డు అధికారులదేనని ఆయ‌న‌ స్పష్టం చేశారు. క‌నీస మ‌ద్ధ‌తు ధ‌ర‌తోనే రైతుల నుంచి పొగాకు కొనుగోళ్లు చేయాల‌ని వ్యాపారుల‌కు, కంపెనీల‌కు తేల్చి చెప్పారు.
Andhra Pradesh farmers
Tobacco Farmers
Tobacco Price
MSP
Tobacco Board
Tobacco Purchases
Farmer Support
Gottepati Ravikumar
గొట్టిపాటి రవికుమార్
అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ రైతులు
పొగాకు పరిశ్రమ
రైతు సంక్షేమం
Scroll for the next article