News1st Aug 05:59 PMSunil Byrisetty1 min read
112కు కాల్.. తక్షణమే ప్రాణాలు కాపాడిన పోలీసులు
కుటుంబ కలహాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటన్ బ్యారేజ్ పైనుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను పోలీసులు కాపాడారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటన్ బ్యారేజ్ పైనుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మహిళను పోలీసులు కాపాడారు. డయల్ 112 కాల్ ద్వారా జిల్లా పోలీసు వారికి సమాచారం అందగా, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించారు. హెడ్ కానిస్టేబుల్ జీ.వి. నరసయ్య, కానిస్టేబుల్ టి. సాంబశివరావు ఘటనా స్థలానికి చేరుకొని సదరు మహిళను గుర్తించి ఆత్మహత్యా ప్రయత్నాన్ని అడ్డుకొని కాపాడారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె బంధువులకు సమాచారం అందించి వారితో పంపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ధవళేశ్వరం ఇన్స్పెక్టర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, కంట్రోల్ రూమ్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సదరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 112 కాల్ కు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఆమె ప్రాణాలు కాపాడి తమకు క్షేమంగా అప్పగించినందుకు ఎస్పీ, ధవళేశ్వరం పోలీస్, కంట్రోల్ రూమ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసినారు.