News18th May 04:31 PMSunil Byrisetty1 min read
దెబ్బకు పాకిస్థాన్ దిగొచ్చింది.. హీరోలా మోదీ!
యుద్ధం కొనసాగితే నామరూపాలు కోల్పోతామనే పాక్ కాళ్లబేరానికి వచ్చిందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయంతో హీరోగా ప్రధానమంత్రి మోదీ అవ
యుద్ధం కొనసాగితే నామరూపాలు కోల్పోతామనే పాక్ కాళ్లబేరానికి వచ్చిందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయంతో హీరోగా ప్రధానమంత్రి మోదీ అవతరించారన్నారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరులో నిర్వహించిన తిరంగా ర్యాలీలో సోమిరెడ్డి పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కీర్తిస్తూ నిర్వహించిన ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారని తెలిపారు.
మన కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కూడా ఉగ్ర తూటాలకు బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మతం పేరు అడిగి ప్రాణాలు తీయడం ఇదే తొలిసారేమోనని వ్యాఖ్యానించారు.
లక్షలాది మంది సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ మన కోసం సరిహద్దులో ప్రాణాలొడ్డి పోరాడుతున్నారని, త్రివిధ దళాలకు దేశమంతా అండగా ఉంది..వారికి మన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు.