News28th Apr 02:53 PMSunil Byrisetty1 min read

తిరుమలలో గదులు కావాలా? ఇలా చేయండి!

కలియుగ దైవం, ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లాలని అందరూ కోరుకుంటారు. అంత దూరం వెళ్లాక గదులు దొరక్కపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు రూమ్స

తిరుమలలో గదులు కావాలా? ఇలా చేయండి!
కలియుగ దైవం, ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లాలని అందరూ కోరుకుంటారు. అంత దూరం వెళ్లాక గదులు దొరక్కపోతే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు రూమ్స్ దొరక్క ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి దేవస్థానం అవగాహన కల్పిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. తిరుమల బస్టాండ్ సమీపంలో ఉన్న CRO కార్యాలయానికి సరైన ఐడీ కార్డుతో వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కన్ఫర్మేషన్ SMS వస్తుంది. మొదట ఎవరు వస్తారో వారికి మాత్రమే గదులు కేటాయిస్తారు. ఈ కార్యాలయం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తుంది. కాబట్టి ముందస్తు ప్రణాళికతో వెళితే తిరుమల దర్శననం సులువుగానే చేసుకోవచ్చు.
TTD
Tirumala
Accommodation Booking
CRO office
వసతి రిజిస్ట్రేషన్
Scroll for the next article