TTD24th Jun 09:07 AMSunil Byrisetty1 min read
సెప్టెంబర్ నెల దర్శన కోటా విడుదల
సెప్టెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవ్వాళ (జూన్ 24న )ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుం
సెప్టెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇవ్వాళ (జూన్ 24న )ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే తిరుమల, తిరుపతిలలో గదుల కోటా కూడా విడుదల చేస్తోంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను జూన్ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
శ్రీవారి సేవ(తిరుమల, తిరుపతి), పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను జూన్ 25న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.