TTD3rd Aug 03:37 PMSunil Byrisetty1 min read

టీటీడీలో ఎఐ.. గూగుల్, టీసీఎస్ సేవలు!

తిరుమలలో దర్శన విషయంలో వైకుంఠ క్యూకాంప్లెక్సులో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టి ₹లో పెట్టుకొని ఏఐ టెక్నాలజీతో ఉచిత సేవలందించడానికి గూగుల్, టిసిఎస్ మరికొన్ని సంస్థలు ము

టీటీడీలో ఎఐ.. గూగుల్, టీసీఎస్ సేవలు!
తిరుమలలో దర్శన విషయంలో వైకుంఠ క్యూకాంప్లెక్సులో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టి ₹లో పెట్టుకొని ఏఐ టెక్నాలజీతో ఉచిత సేవలందించడానికి గూగుల్, టిసిఎస్ మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి . ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 2 గంటలలోపు సామాన్య భక్తులకు దర్శనం కల్పించాలని టిటిడి పాలక మండలి ముందడుగు వేస్తోంది. శ్రీవారిని‌ క్షణ కాలం పాటు దర్శించుకునేందుకు సామాన్యభక్తులు ఎదుర్కుంటున్న జాప్యాన్ని, ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ చొరవ తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీతో సాధ్యమైనంత త్వరితగతిన భక్తులు స్వామివారి సంతృప్తిగా దర్శనం పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏఐ సాంకేతికత సహకారం అందించేందుకు గూగుల్, టిసిఎస్ ,తదితర ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చి అధునాతన టెక్నాలజీ అందిస్తామని చెబుతున్నాయని వివరించారు. భక్తులను గంటలు, రోజులు తరబడి షెడ్లలో, కంపార్టమెంట్లలో వేచి చూసే అవసరం లేకుండా ఏఐను తీసుకురావాలని నిర్ణయించామని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్న తరుణంలో టిటిడి కూడా భక్తుల కోసం ఏఐ టెక్నాలజీ వాడడం లో ఎలాంటి తప్పు లేదని పేర్కొన్నారు.
TTD
Tirumala
AI in Tirumala
Google TTD collaboration
TCS TTD partnership
AI for pilgrims
Vaikuntham Queue Complex
Tirupati temple technology
artificial intelligence in temples
fast darshan system
TTD chairman BR Naidu
ఏఐ దర్శనం
టెక్నాలజీ దర్శనం
Scroll for the next article