News10th Dec 12:13 PMSunil Byrisetty1 min read
టీటీడీకి రెండు కార్లు విరాళం
తిరుమల శ్రీవారి సేవలో వినియోగించేందుకు భక్తులు రెండు కార్లు విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లికొండ అనే భ
తిరుమల శ్రీవారి సేవలో వినియోగించేందుకు భక్తులు రెండు కార్లు విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన లోటస్ ఎలక్ట్రిక్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో అర్జున్ కొల్లికొండ అనే భక్తుడు బుధవారం టీటీడీకి రూ.10 లక్షల విలువైన సిట్రాయెన్ (ఈసీ3) ఎలక్ట్రిక్ కారును విరాళంగా అందించింది. అదేవిధంగా చెన్నైకు చెందిన శరవనన్ కరుణాకరన్ అనే భక్తుడు రూ.9 లక్షలు విలువైన సిట్రాయెన్ (బసాల్ట్ ఎక్స్ ప్లస్ యంటీ) కారును విరాళంగా అందించారు.ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయం ముందు కార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ రామకృష్ణకు తాళాలు అందించారు.