TTD4th Nov 05:50 PMSunil Byrisetty1 min read

దేశానికే ఆదర్శంగా తిరుమల ల్యాబ్

తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అ

దేశానికే ఆదర్శంగా తిరుమల ల్యాబ్
తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచేలా అభివృద్ధి చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. తిరుమలలోని వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ లో ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చి 21న ప్రారంభించిన ఈ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబొరేటరీని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సహకారంతో కేవలం 11 నెలల్లోనే అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోని ఇతర ఆలయాలు, దేవాదాయ సంస్థల్లో లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ల్యాబ్‌ను నిర్మించినట్లు పేర్కొన్నారు. ల్యాబ్ నిర్వహణ కోసం ప్రస్తుతం అంతర్గత సిబ్బందితో పాటు రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషన్ నుంచి డిప్యుటేషన్‌పై తీసుకున్న సిబ్బందితో కలిపి మొత్తం 34 మంది పనిచేస్తున్నారని తెలిపారు. పూర్తిస్థాయిలో ల్యాబ్ నిర్వహణకు మరో ఎనిమిది మంది అవసరమని, త్వరలో వారిని కూడా నియమించి మొత్తం 42 మంది అర్హత కలిగిన సిబ్బందితో అన్ని విభాగాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో సుమారు 2,500 ఆహార నమూనాలను సేకరించి పరీక్షించినట్లు తెలిపారు. ప్రతిరోజూ తాగునీటి నమూనాలను కూడా పరీక్షిస్తున్నట్లు వివరించారు. లడ్డూ నాణ్యతను పరిశీలించేందుకు సుమారు 11 రకాల పారామీటర్లను పరీక్షించే అత్యాధునిక పరికరాలు ల్యాబ్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
Scroll for the next article