TTD20th Sep 11:39 AMSunil Byrisetty1 min read

తిరుమలలో వైభవంగా గరుడ సేవ

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. గరుత్మంతునిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువైన శ్రీ మలయప్పస్వామి

తిరుమలలో వైభవంగా గరుడ సేవ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన గరుడ వాహన సేవ అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. గరుత్మంతునిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువైన శ్రీ మలయప్పస్వామి వారు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ లక్షలాది మంది భక్తులకు అభయమిచ్చారు. ఈ అపురూప దృశ్యాన్ని కనులారా వీక్షించేందుకు తరలివచ్చిన భక్తుల "గోవిందా.. గోవిందా.." నామస్మరణలతో సప్తగిరులు మార్మోగాయి. గజరాజులు ముందు నడుస్తుండగా, భజన బృందాలు, కోలాటాలు, జీయంగార్ల ఘోష్టి, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు. గరుడ సేవను తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. మాడ వీధుల్లోని 1.90 లక్షల మంది సామర్థ్యం గల గ్యాలరీలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
Scroll for the next article