TTD29th Sep 01:18 PMSunil Byrisetty1 min read

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో భక్తులను క్షేమంగా తిరుమలకు చేరవేయడం అభినందనీయమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 24 గంటల్

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవలో ఏపీఎస్ఆర్టీసీ రికార్డు స్థాయిలో భక్తులను క్షేమంగా తిరుమలకు చేరవేయడం అభినందనీయమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. 24 గంటల్లోనే 5,642 ట్రిప్స్ – 2,16,753 మంది భక్తులకు రవాణా సదుపాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయి రవాణా – జీరో బ్రేక్‌డౌన్ తో నిరవధిక సేవలు అందించడం ప్రశంసనీయమన్నారు. గత సంవత్సరం కంటే ఈసారి భక్తుల సంఖ్య రవాణాలో భారీ పెరుగుదల నమోదైందని, గత రికార్డులను గరుడ సేవ రవాణా వ్యవస్థ అధిగమించిందని తెలిపారు. మెకానికల్ సిబ్బంది కృషి వల్ల జీరో బ్రేక్‌డౌన్ తోడ్పాటుతో భక్తుల సేవలో నిరంతరం కృషి చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ముందుకు సాగుతోందని మంత్రి మండిపల్లి ప్రత్యేకంగా ప్రశంసించారు.
Andhra Pradesh
Tirumala
Brahmotsavam
Garuda Seva
APSRTC
Devotees Service
Record Trips
Zero Breakdown
Pilgrimage Transport
Minister Ramprasad Reddy
శ్రీవారి సేవ
తిరుమల యాత్ర
బ్రహ్మోత్సవ వేడుకలు
గరుడ వాహన సేవ
Scroll for the next article